Content pfp
Content
@
0 reply
20 recasts
20 reactions

Sri pfp
Sri
@srikanth
మీ జీవితంలో మీరే హీరో ! ఒక సారి ఎవరో ఏదో సాధించారని అతన్ని చూసేందుకు వెళ్లడం.. లేదా అభిమాన హీరో అని ధియేటర్లలో చొక్కాల చింపు కోవడం .. లేదా రాజకీయ పార్టీల ర్యాలీల్లో పాల్గొనేందుకు ఆవేశపడటం వంటివి చేసే ముందు అసలు మన జీవితం ఏమిటి.. మనం చేయాల్సిన పనులు ఏమిటి.. చేస్తున్నదేమిటి అని ఒక్క సారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆ హీరో.. క్రికెటర్ లేదా రాజకీయ నాయకుడు..తన డ్యూటీని తాను చేసుకుంటున్నాడు.
1 reply
1 recast
1 reaction

Sri pfp
Sri
@srikanth
తన జీవితంలో తాను ఎదిగేందుకు కష్టపడుతున్నాడు. ఆ స్ఫూర్తి మీలో ఎందుకు లేదో తెలుసుకోవాలి. వేరేవాళ్లకు జిందాబాద్‌లు కొట్టాల్సిన దౌర్భాగ్యమైన అవసరం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. వాళ్ల విజయాల నుంచి స్ఫూర్తి తెచ్చుకోవాలి కానీ వారి విజయాలకు సంబరపడిపోయి.. ప్రాణాల మీదకు తెచ్చుకోవడం జీవితం కాదు.
0 reply
1 recast
1 reaction